Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువరాజ్ రాణిస్తాడు.. సక్సెస్ అవుతాడు: గంగూలీ

టీమిండియా జట్టులోకి మూడేళ్ల త‌రువాత యువరాజ్ సింగ్ పునరాగమనం చేయ‌డం ప‌ట్ల టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. యువీని రెండు ఫార్మాట్లలో ఎంపిక చేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం నిజంగా సరైనదేన‌ని ఆయ‌న అన్నాడు. సెల‌క్ట‌ర్లు యువీపై విశ్వాసం ఉంచి ఎంపిక చేశార‌ని, త‌న‌కు కూడా అత‌డిపై ఎంతో నమ్మకం ఉందని అన్నాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ల‌లో యువరాజ్ రాణిస్తాడని, యువరాజ్ విజయవంతం అవుతాడని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు. యువ‌రాజ్ సింగ్‌ 2013 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో చివ‌రిసారిగా ఆడాడు. వరల్డ్ టీ20లో భాగంగా 2016 మార్చిలో ఆసీస్ తో ఆఖ‌రి టీ20 ఆడాడు.
ganguly

More Telugu News